ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవలే రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ను ఎంతో అలరించిన ప్రభాస్ ఆ చిత్రం ద్వారా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.  వరుసగా ఆయన చిత్రాలు పాన్ ఇండియాలో తెరకెక్కి విడుదలయ్యి వందల కోట్ల కలెక్షన్లను రాబడుతోంది. ఎంతైనా ఇది విశేషం అనే చెప్పాలి. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు కలెక్షన్ల పరంగా మాత్రం ఏ మాత్రం  నిరాశ పరచలేదు అనే చెప్పాలి. ఆ విధంగా ప్రభాస్ తన సినిమాలో ఉన్న లోపాలను సరి చేస్తే బాగుంటుంది అని ఈ సినిమాలు చూసిన తరువాత వారి అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్ భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ అలాగే ప్రాజెక్టు కే, స్పిరిట్ వంటి సినిమాలను కూడా ఆయన చేస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఈ చిత్రాల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా అన్నీ జాగ్రత్తగా సమకూర్చుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది అని ప్రభాస్ అభిమానులకు చెప్తున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులందరినీ భారీగా నిరాశపరచడంతో ఇప్పుడు చేయబోయే సినిమాలు తప్పకుండా అందరికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో త్వరలో ఆయన విడుదల చేయబోతున్న సలార్  చిత్రం పెద్ద విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్సినిమా చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా ఫైనల్ చేయగా కేవలం రెండు నెలల సమయంలో చిత్రాన్ని పూర్తీ చేసి సినిమా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. అలా ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాల ద్వారా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: