లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇంకా విడుదల కాకుండానే విజయ్ దేవరకొండ తన సినిమాల స్పీడ్ పెంచాడు. ఈమధ్యనే మొదలైన శివ నిర్వాణ విజయ్ దేవరకొండల కాంబినేషన్ మూవీ హడావిడిగా సెట్ కావడం వెనుక సుకుమార్ నిర్ణయం ఉంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘పుష్ప 2’ మూవీ తరువాత సుకుమార్ విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.
ఈవిషయాన్ని పరోక్షంగా సుకుమార్ విజయ్ దేవరకొండలు అంగీకరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సుకుమార్ ఆలోచనలు మారాయని ‘పుష్ప 2’ తరువాత సుకుమార్ చిరంజీవితో ఒక భారీ సినిమాను నిర్మించే ఆలోచనలలో ఉండటంతో తాత్కాలికంగా విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టాడు అని అంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ గ్రహించడంతో అతడు సుకుమార్ గురించి వేచి చూడకుండా పూరీతో మరొక మూవీ ప్రాజెక్ట్ గా ‘జన గణ మన’ శివ నిర్వాణ తో కొత్త మూవీని లైన్ లో పెట్టాడు అని అంటారు.
దీనికితోడు విజయ్ దేవరకొండకు మళ్ళీ ‘గీత గోవిందం’ లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు చేయాలనే కోరికతో ఉన్నాడు. దీనితో ఒక యాక్షన్ మూవీస్ చేస్తూ మరొక వైపు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను కూడ సమాంతరంగా పరుగులు తీయిస్తూన్నాడు. లేటెస్ట్ గా మొదలైన శివ నిర్వాణ విజయ్ దేవరకొండల మూవీ భారీ సెంటిమెంట్స్ తో కూడిన సబ్జెక్ట్ అంటున్నారు.
అంతేకాదు ఈ మూవీలో సమంత పాత్ర విజయ్ దేవరకొండ పాత్రతో సరిసమానంగా ఉంటుంది అని కూడ ప్రచారం జరుగుతోంది. ‘రోజా’ మూవీ తరువాత చాలాకాలం తరువాత కాశ్మీర్ ప్రాంత నేపధ్యంలో జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీగా నిర్మింపబడే ఈ మూవీలో లవ్ బాడ్స్ గా విజయ్ సమంతలు నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత సమంతను ప్రేమికురాలి పాత్రలో జనం అంగీకరిస్తే సమంతకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్లే అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి