కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్. ఈ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ తో పాటు అన్ని భాషల లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో కథానాయికగా బుట్టబొమ్మ నటించింది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు . తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయడం జరిగింది దాంతో మొదటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా మొదటిరోజు నెగిటివ్ టాక్ రావడంతో ఇక ఆరోజు నుంచి సినిమా టికెట్లు బుకింగ్స్ చాలా దారుణంగా పడిపోయాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి పోటీగా kgf -2 ,RRR సినిమా విడుదల కాగా ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రాలకి మొగ్గుచూపారు. అయితే ఇప్పటి వరకు బీస్ట్ చిత్రం ఎంతటి కలెక్షన్లు రాబట్టి తో ఒకసారి చూద్దాం.

1). నైజాం-2.45 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.10 కోటి రూపాయలు.
3). ఉత్తరాంధ్ర- 90 లక్షలు
4). ఈస్ట్-63 లక్షలు
5). వెస్ట్-62 లక్షలు.
6). గుంటూరు -80 లక్షలు
7). కృష్ణ- 52 లక్షలు.
8). నెల్లూరు -40 లక్షలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.7.42 కోట్ల రూపాయలను రాబట్టింది.

బీస్ట్ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల లోనే రూ.10.68 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఇవ్వాలి అంటే కచ్చితంగా రూ.11 కోట్ల రూపాయలను రాబట్టాలని ఉంది. కానీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో కేవలం రూ.7.42 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సినిమాకు ఉన్న బయ్యర్లకు రూ.3.26 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. అయితే విజయ్ నటించిన గతంలో చిత్రాలు.. మాస్టర్, విజిల్, సల్ఫర్ వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీటన్నిటికీ ఒక్కసారిగ బీస్ట్ సినిమా బ్రేక్ వేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: