‘ఆచార్య’ విడుదల కావడం సూపర్ ఫ్లాప్ గా మారిపోవడం జరిగి 10రోజులు దాటిపోయినా ఇంకా అనేకరకాల గాసిప్పులు ఈమూవీ పై హడావిడి చేస్తూనే ఉన్నాయి. ‘ఆచార్య’ మూవీని నిర్మించింది మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ రామ్ చరణ్ సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్. అయితే ఈమూవీ విడుదల తరువాత మాత్రం నిర్మాతలలో ఎవరికివారు మౌనం వహిస్తున్నారు.


బహుశా ఈమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో బయ్యర్ల నుండి వచ్చే ఒత్తిడికి దూరంగా ఉండాలని ఇలాంటి వ్యూహం అనుసరించి ఉంటారని కొంతమంది భావించారు. ఈ పరిస్థితుల మధ్య సోషల్ మీడియాలో మరొక షాకింగ్ రూమర్ ఈమూవీ నిర్మాతల పై చెక్కర్లు కొడుతోంది. ఈ రూమర్ లో వాస్తవాలు చాలామందికి తెలియకపోయినా ప్రస్తుతం ఈ రూమర్ ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలకు అవకాశాలు ఇస్తోంది.


‘ఆచార్య’ విడుదలకు ముందు ఈమూవీ నిర్మాతలుగా నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి ల పేర్లు ఆమూవీకి సంబంధించిన ప్రతి పబ్లిసిటీ మెటీరియల్ లోను కనిపించాయి. అయితే ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈ రూమర్ ప్రకారం ‘ఆచార్య’ విడుదలకు కొద్దిరోజుల ముందు బుక్ మై షో ‘ఆచార్య’ వివరాలలో నిర్మాతల పేర్లు నుండి నిరంజన్ రెడ్డి పేరు  కనపడక పోవడం వెనుక  సరికొత్త గాసిప్ హడావిడి మొదలైంది.


వాస్తవానికి ఇది నిజమా కాదా అన్న విషయమై క్లారిటీ లేదు ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే. ‘ఆచార్య’ నష్టాలకు చరణ్ కూడ బాధ్యత వహిస్తాడా అంటూ మరికొందరు ఊహాగానాలు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఒక బయ్యర్ చిరంజీవి పేరుతో వ్రాసిన ఒక ఓపెన్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఆచార్య’ మూవీ పై పెట్టిన పెట్టుబడిలో 25 శాతం కూడ రికవరీ కాలేదు అని గగ్గోలు పెడుతూ ఆ బయ్యర్ చిరంజీవికి ఓపెన్ లెటర్ వ్రాసాడు. దీనితో ‘ఆచార్య’ నష్టాలకు ఎంతోకొంత చరణ్ కూడ పరోక్షంగా బాధ్యత వహించవలసి ఉంటుందా అంటూ మరొక కొత్త చర్చ ఇండస్ట్రీ వర్గాలలో మొదలైంది..


మరింత సమాచారం తెలుసుకోండి: