వరుస పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ చేతిలో ఉన్న భారీ సినిమాల్లో 'ప్రాజెక్ట్ K' కూడా ఒకటి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, దిశా పటాని ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.


ప్రభాస్ అభిమానులంతా ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ సినిమా పరాజయం అవ్వడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారట.. తాజాగా ఓ ప్రభాస్ అభిమాని గతంలో నాగ్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ ని షేర్ చేసి.. 'హాయ్ నాగ్ అశ్విన్ అన్నా గుర్తున్నామా' అంటూ 'ప్రాజెక్ట్ K' అప్డేట్ గురించి అడిగాడట. ఈ ట్వీట్ కి నాగ్ అశ్విన్ ని ట్యాగ్ కూడా చేశాడు.


ప్రభాస్ అభిమాని చేసిన ఈ ట్వీట్ చూసిన నాగ్ అశ్విన్ దానికి రిప్లై ఇచ్చాడని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. "గుర్తున్నారు.. ఇప్పుడే సినిమా ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. ప్రభాస్ గారి ఇంట్రో సీన్ కూడా పూర్తి చేసాం.అది కూడా చాలా బాగా వచ్చింది. హీరో చాలా కూల్ గా కనిపిస్తారు. జూన్ చివరి నుంచి నెక్స్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా, రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం అయితే ఉంది. కానీ ప్రాజెక్ట్‌- K సినిమా కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం" అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ ట్వీట్ ని తెగ షేర్ చేస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం సలార్, ఆది పురుష్ సినిమాలు రిలీజ్ అయినా తర్వాతే 'ప్రాజెక్ట్ K' రిలీజ్ అయ్యేలా ఉన్నట్టు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: