సినిమాలో వెంకీ చేసిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారు. అయితే ఈ సినిమా ఈ సినిమా తరువాత వెంకటేష్ తన నెక్ట్స్ చిత్రాల ను ఇటీవల అనౌన్స్ చేశాడు. తన నెక్ట్స్ రెండు సినిమాల ను మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల లో చేయబోతున్నట్లు వెంకీ తెలిపాడు. అయితే ఈ సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రాబోయే సినిమాను తొలుత ప్రారంభించేందుకు వెంకీ ఆసక్తిగా ఉన్నాడు...
అయితే ఈ సినిమా ను కాస్త లేట్ గా సెట్స్ మీదకు తీసుకెల్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆగస్టు నెలా ఖరున ప్రారంభించేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'కబీ ఈద్ కబీ దివాలీ'లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని వెంకీ భావిస్తున్నాడు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రాబోయే సినిమాను జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించబోతున్నాడు...మరి ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందొ చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి