‘విరాటపర్వం’ మూవీలో కీలకపాత్ర చేసిన నవీన్ చంద్ర ఈ మూవీని ప్రమోట్ చేస్తూ మధ్యలో బాలకృష్ణ ప్రస్తావన తీసుకువచ్చాడు. తాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణతో చేస్తున్న మూవీలో తాను నెగిటివ్ పాత్రలో నటిస్తున్న విషయాన్ని వివరిస్తూ ఆమూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో తనకు ఏర్పడిన అనుబంధం గురించి వివరించాడు.
తాను ఇప్పటివరకు ఎందరో టాప్ హీరోలతో కలిసి నటించినప్పటికీ బాలకృష్ణతో కలిసి నటించినప్పుడు తనకు కలిగిన అనుభూతి ప్రత్యేకం అని అంటున్నాడు. బాలయ్య షూటింగ్ సమయంలో తన వద్దకు వచ్చి ఎంతో సరదాగా మాట్లాడటమే కాకుండా 30 సంవత్సరాల యంగ్ హీరో వేసే జోక్స్ అన్నీ తనతో వేసి తెగ నవ్వించిన విషయం గుర్తుకు చేసుకున్నాడు. అలా నవ్వుతూ కనిపించిన బాలయ్యను కౌగలించుకుని ముద్దు పెట్టుకోవాలి అని అనిపించిందని అలా చేస్తే బాగుండదు అన్న ఉద్దేశ్యంతో తాను మౌనం వహించిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
ఇక నటన విషయంలో బాలయ్య తాను బాగా నటించడమే కాకుండా తన పక్కన నెగిటివ్ పాత్రను చేసే నటుడు బాగా రాణించాలని తెగ తపన పడతాడని తాను డైలాగ్స్ చెప్పే విషయంలో ఏచిన్న పొరపాటు చేసినా ఏమాత్రం అసహనం లేకుండా మరో షాట్ కు రెడీ అని అంటాడు అన్న విషయాన్ని బయట పెట్టాడు. ‘విరాటపర్వం’ మూవీ తరువాత తన కెరియర్ కు మరో మలుపు వస్తుందని నవీన్ చంద్ర భావిస్తున్నాడు. హీరోగా రాణించాలి అన్న అతడి ప్రయత్నాలకు సరైన దర్శకుడి సపోర్ట్ దొరికితే ఇతడు కూడ మంచి హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి