టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో నిరంతరం హీరోయిన్స్ కొరత కొనసాగుతూనే ఉంది. ఎంతమంది కొత్త హీరోయిన్స్ మళయాళ హిందీ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పటికీ కొత్త హీరోయిన్స్ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. టాప్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ఒకసారి తమతో నటించిన హీరోయిన్ మరొకసారి రిపీట్ చేయడానికి ఇష్టపడని పరిస్థితులలో ఈ హీరోయిన్స్ కొరత కొనసాగుతూనే ఉంది.
గ్లామర్ తో పాటు నటించి మెప్పించగల సామర్థ్యం అతి తక్కువమందికి ఉండటంతో పాపులర్ హీరోయిన్స్ కు కోట్లాది రూపాయలు పారితోషికంగా ఇవ్వవలసి వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న సమస్యలకు ‘మేజర్’ మూవీలో నటించిన సాయి మంజ్రేకర్ పరిష్కారం కాబోతోంది అంటూ అంచనాలు వస్తున్నాయి.
‘మేజర్’ మూవీలో అడవి శేషు పక్కన నటించిన ఈమె తన గ్లామర్ తో పాటు తన నటనతో కూడ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక యంగ్ హీరోయిన్ నటనలో రాణించడంతో ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి అంతా ఈమె పై పడింది. వాస్తవానికి ఈమె గతంలో వరుణ్ తేజ్ పక్కన ‘గని’ మూవీలో నటించినప్పటికీ ఆమెను ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఎవరు పట్టించుకోలేదు.
అయితే ‘మేజర్’ బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో ఈమె గురించి నిర్మాతలతో పాటు దర్శకులు కూడ దృష్టి పెట్టడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అందంతో పాటు మంచి పర్సనాలిటీ ఉండటంతో ఈమె భవిష్యత్ లో టాప్ యంగ్ హీరోలకు కూడ హీరోయిన్ గా మారే ఆస్కారం ఉంది అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు త్వరలో తాము తీయబోతున్న భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఆమెతో సంప్రదిస్తున్నట్లు టాక్. దీనితో ఈమె ఇదే హవా కొనసాగిస్తే పూజా హెగ్డే రష్మిక లకు పోటీ అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి