జాతరత్నాలు సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు అనుదీప్. తొలి సినిమాతోనే ఇంతటి సక్సెస్ సాధించిన ఈ దర్శకుడుతో కలిసి సినిమా చేయాలని చాలామంది అగ్ర హీరోలు భావించారు కానీ ఈ దర్శకుడు అందరికంటే వినూత్నంగా ఆలోచించి ఓ తమిళ హీరోతో తన తదుపరి సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. జాతి రత్నాలు సినిమా అంత విజయం సాధించడానికి కారణం ఆ సినిమాలో ఉన్న ఆహ్లాదకరమైన కామెడీనే.

ఆ విధమైన హాస్యం ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులు చూసి చాలా రోజులు అయిపోయింది. జంధ్యాల తరహాలో కామెడీని ప్రేక్షకులకు పంచి ఘన విజయాన్ని అందుకున్న అనుదీప్ తన దర్శకత్వ ప్రతిభను కూడా చూపించి ఇంతటి స్థాయిలో ఆ సినిమా విజయం అందుకునేలా చేసుకున్నాడు. ఆ విధంగా ఇప్పుడు చేస్తున్న ప్రిన్స్ సినిమాపై కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రిన్స్.  మంచి కథ వెరైటీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ప్రేక్షకులలో ఉన్నాయి. 

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయగా ఈ సినిమా ద్వారా సరికొత్త అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అనే కాన్ఫిడెన్స్ లో దర్శకుడు ఉన్నాడు ద్వి భాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని భావిస్తున్నారు. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న శివ కార్తికేయన్ కు కథలు ఎంపిక గురించి మంచి టేస్ట్ ఉంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కొత్త కథను అయితేనే ఆయన ఎంపిక చేసుకుంటాడు. ఆ విధంగా ఈ సినిమా కథ చాలా బాగా ఉండబోతుంది అని దీన్నిబట్టి చెప్పవచ్చు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: