మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ తో బాక్స్ ఆఫీస్  దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . క్రాక్ సినిమా కంటే ముందు వరుస పరాజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన రవితేజ క్రాక్ మూవీ విజయం తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు . 

అలా క్రాక్ మూవీ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ కొంత కాలం క్రితమే రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక ఫ్లాప్ మూవీ గా నిలిచిపోయింది. ఇలా క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఖిలాడి లాంటి ప్లాప్ మూవీ ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న రవితేజ ప్రస్తుతం శరత్ మండువ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం ఒక అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం ఈ సినిమా గ్లిమ్స్ కు సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిముషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: