తాజాగా జూన్ 10 న తెలుగుతో పాటుగా పలు బాషల్లో రిలీజ్ అయిన కన్నడ చిత్రం ‘777 చార్లీ'. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ టాక్ తో థియేటర్ లో నడిచింది. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్ల‌తో 9.2/10 సంపాదించి రికార్డు సృష్టించింది. కాగా కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రలో కే కిర‌ణ్ రాజ్ డైరెక్షన్ లో ‘777 చార్లీ’ సినిమా రూపొందింది. ధ‌ర్మ అనే వ్య‌క్తి నిజ జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే పెంపుడు కుక్క రావడం..ఆ తరవాత ఆ కుక్క రాకతో అతడి జీవితం ఎలా మారిపోయింది అన్నది ఈ కథ.

మూవీ రిలీజ్ అయ్యి మూడు వారలు గడుస్తున్నా బాక్సాపీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో ఇప్పటికీ అదే స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన, విలక్షణాత్మకమైన నటనతో విమ‌ర్శ‌కుల నుండి  ప్ర‌శంస‌లు అందుకున్నాడు హీరో రక్షిత్‌ శెట్టి. క్రిటిక్స్ సైతం ఈ సినిమాకి ఫుల్ రేటింగ్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రక్షిత్ శెట్టి మరియు చార్లీ కి మధ్యన సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న బడ్జెట్ సినిమాలలో ఉత్తమ చిత్రంగా అందరూ దీనికి మెచ్చుకుంటున్నారు.

ఇక ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద  కలెక్షన్ల విషయానికి వస్తే... ఇరు తెలుగు రాష్ట్రాల్లో 2.09 కోట్లు కు పైగా వసూలు చేసింది. 19 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
నైజాం : 63L
సీడెడ్ : 21L
ఆంధ్రప్రదేశ్ : 40L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ :2.09కోట్లు అదే విధంగా టోటల్ (1.82కోట్ల గ్రాస్) గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: