ఇటీవలి కాలంలో బుల్లి తెర పై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పుడూ కొత్తగానే ఆలోచిస్తూ ఉంటారు బుల్లితెర షో స్ నిర్వాహకులు.  ఇలా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ అందించడంలో అందరికంటే మల్లెమాల వాళ్ళు  కాస్త ముందు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు అని తెలిస్తే ఎలాంటిది చేయడానికైనా సిద్ధమై పోతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అని చెప్పాలి . ఈ క్రమంలోనే ఈటీవీ ఛానల్ ప్రారంభమై 27 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇటీవలే ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు మల్లెమాల వాళ్ళు.


 సాధారణంగా బుల్లితెరపై ఏదైనా కార్యక్రమాలు చేపట్టారు అంటే చాలు ఇక ఈ టీవీ లో వివిధ కార్యక్రమాలలో కనిపించే కమెడియన్స్ అందరూ కూడా స్పెషల్ ఈవెంట్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక సీరియల్ సెలబ్రిటీలను సినీ సెలబ్రిటీలను కూడా పిలిచి వారితో ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ అందించాలని భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం మరింత కొత్తగా ఆలోచించారూ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటివరకు సినీ సెలబ్రిటీలు మాత్రమే కార్యక్రమాలకు ఆహ్వానించిన వారు ఇక ఇప్పుడు న్యూస్ లీడర్లను కూడా వదల్లేదు.



 ఈటీవీలో రాత్రి 9 గంటల సమయంలో వచ్చే న్యూస్ ఎంత పాపులారిటీ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా మిస్ చేయకుండా ఇక ఈ న్యూస్ బులిటెన్స్ చూస్తూ ఉంటారూ. ఇక ఇందులో ఉండే న్యూస్ రీడర్ లను ఇట్టే గుర్తుపట్టేస్తారు అని చెప్పాలి. అయితే ఇటీవలే భలే మంచి రోజు అనే కార్యక్రమంలో మనందరికీ తెలిసిన న్యూస్ రీడర్ లను వరుసక్రమంలో కూర్చోపెట్టి వారితో సుడిగాలి సుధీర్ గురించి పలు విషయాలను వార్తల రూపంలో చూపించారు. ఇది చూసిన ప్రేక్షకులు చివరికి న్యూస్ రీడర్లను కూడా మల్లెమాల వాళ్ళు వదలలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: