టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరిగ్గా నెల రోజుల్లో గాడ్ ఫాదర్ సినిమా తో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు హిట్ అయినా అవ్వకున్నా మినిమం నెల రోజుల ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తున్నారు.ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నింటికి కూడా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. కానీ గాడ్ ఫాదర్ కి మాత్రం ఆ రేంజ్ ప్రమోషన్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.ఈ వారం ప్రమోషన్స్ ను షురూ చేసే ఉద్దేశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చిరంజీవి వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు. మరో రెండు వారాల పాటు షూటింగ్ లోనే ఉంటాడని సమాచారం అందుతోంది. కనుక గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడు మొదలు అయ్యేది క్లారిటీ లేదు.మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పై ప్రస్తుతానికి భారీ హైప్ లేదు. కనుక సినిమా కు భారీ ఎత్తున ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రమోషన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో ఈ సినిమా కు హైప్ క్రియేట్ చేయడానికి మెగా కాంపౌండ్ ఆసక్తి చూపడం లేదేమో అంటూ టాక్ వినిపిస్తోంది.


మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. లూసీఫర్ కథ లో మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే మార్చినట్లుగా తెలుస్తోంది. సల్మాన్ ఖాన్.. నయనతార.. సత్యదేవ్.. పూరి జగన్నాథ్.. సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.గాడ్ ఫాదర్ ఫలితం పై భోళా శంకర్ ఇంకా వాల్తేరు వీరన్న సినిమాల  భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి గాడ్ ఫాదర్ సినిమా వైపు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఆయన ఈ సినిమా పై చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. అయినా కూడా భారీ ఎత్తున ఈ సినిమాకు మాత్రం ప్రమోషన్స్ చేయాలని యూనిట్ సభ్యులు భావించడం లేదు. ఆచార్య డిజాస్టర్ కావడం వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ చెయ్యట్లేదేమో అనే టాక్ వినిపిస్తుంది. ఇక వచ్చే వారంలో అయినా ఈ సినిమా  ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: