తెలుగు సినిమా పరిశ్రమలో రోజూ ఏదో ఒక కొత్త హీరో వస్తూనే ఉంటాడు. కానీ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడమే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య. ఒకటి రెండు సినిమాలు హిట్ పడితే చాలు, ఇంకొంతకాలం ఇండస్ట్రీలో ఉండొచ్చు అనుకుంటున్నారు. కానీ దొరికిన ఆ విజయాన్ని ఏ విధంగా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి అన్న దానిపై దృష్టి పెట్టడం లేదన్నది తెలుస్తున్న విషయం. అయితే ఈ ఉదాహరణ మన పక్కింటి కుర్రాడిలా అనిపించే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు సరిగ్గా సరిపోతుంది. ఈ హీరోకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా రాజావారు రాణివారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత శ్రీధర్ గాదె అనే డైరెక్టర్ తో ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాను తెరకెక్కించాడు. ఇందులో పాటలు, యాక్షన్ మరియు నటన అన్నీ యువతను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే రోజు రోజుకీ క్రేజ్ పెరిగింది. దీనితో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత తీసిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. నిన్న వచ్చిన నేను మీకు బాగా కావలసినవాడిని అన్న సినిమా సైతం మనోడికి నిరాశను మిగిల్చింది. ఎక్కడ తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని అలోచించి సరిచేసుకోకుండా వరుస పెట్టి సినిమాలు తీస్తే లాభం ఏమిటి ? ఉదాహరణకు ఇందులో తీసుకున్న పాయింట్ మంచిదే అయినా తీసే విధానంలో కొత్తదనం లోపించింది.

ముఖ్యంగా డైరెక్టర్ శ్రీధర్ గాదె రెండవ సారి కిరణ్ తో సినిమా తీసి హిట్ కొట్టడంలో ఫెయిల్ అయ్యాడు. కథనం పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉండేది. ఇక కిరణ్ సొంతంగా రాసుకున్న డైలాగులు అంతగా ఆకట్టుకోలేదు. పాటలు, కెమెరా పనితనం, ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లేదు. జబర్దస్త్ లో వాడేసిన డైలాగ్ శైలిని ఇక్కడ వాడడం కూడా ఒక నెగటివ్ అని చెప్పాలి. మరి దీనికి కలెక్షన్ లు ఏ మాత్రం వస్తాయన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: