బిగ్ బాస్ సీజన్ 6లో కామన్ మెన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది రెడ్డి. బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఆది రెడ్డి ఇప్పుడు హౌస్ మెట్ గా కూడా ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. బిగ్ బాస్ ని కాచి ఒడపోసినట్టుగా చదివేసిన ఆది రెడ్డి రివ్యూస్ చెప్పి చెప్పి ఆట నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా గెస్ చేసే కెపాసిటీ తెచ్చుకున్నాడు. అయితే అదే ఆట పద్ధతిని హౌస్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు.

ఎక్కడ తన సెన్స్ కోల్పోకుండా ఎవరిని దూషించకుండా.. ఎవరికీ డైరెక్ట్ టార్గెట్ అవకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నాడు. మొదటివారం లోనే రేవంత్ తో గొడవ జరిగినా సరే అది కూడా చర్చించుకుని సాల్వ్ చేసుకున్నాడు. ఇక 3వ వారం హౌస్ కెప్టెన్ గా కూడా ఆది రెడ్డి నిలిచాడు. సో చూస్తుంటే మిగతా హౌస్ మెట్స్ కన్నా వారం వారానికి అతని గ్రాఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 6 లో ఇప్పటివరకు ఎవరు టాప్ 5 లో ఉంటారన్నది క్లారిటీ రాలేదు.

3 వారాలకే టాప్ 5 గెస్ చేయడం కష్టమే కానీ ఆది రెడ్డి దూకుడు.. తెలివైన ఆట తీరు చూస్తుంటే అతను టాప్ 5 పక్కా ఉంటాడని అనిపిస్తుంది. అంతేకాదు బయట ఎలాగు అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను నామినేషన్స్ లో వచ్చినా ఈజీగా సేవ్ అవుతాడు. మరీ దారుణంగా ఆడి.. పోట్లాడితే తప్ప ఇప్పుడు ఆడుతున్నట్టుగా ఆడినా ఆది రెడ్డి ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడని ఫిక్స్ అవ్వొచ్చు. మరి బిగ్ బాస్ కదా ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఆది రెడ్డి నిజంగానే చివరి వరకు ఉంటాడా లేడా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: