సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సూపర్ హిట్ సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. అయన తాజాగా సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మాస్ ప్రేక్షకులలో మహేష్ యొక్క పవర్ ను తెలియజేసిన ఈ సినిమా కు పరశురామ్ దర్శకత్వం అందించగా ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. అలా ఈ సినిమా సూపర్ హిట్ తరవాత మహేష్ ఏ సినిమా లో కనిపిస్తాడా అన్న ఆసక్తి అందరిలో కనిపించింది. ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ తో పాటు అదిరిపోయే యాటిట్యూడ్ తో నటించాలని అందరు కోరుకున్నారు. అందుకే మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు అయ్యింది అని చెప్పాలి.

అయితే మహేష్ బాబు తల్లి చనిపోవడంతో ఈ సినిమా కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది.  గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా‌ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా లు సూపర్ హిట్ లు అయినా నేపథ్యంలో తప్పకుండా ఈ చిత్రం మళ్ళీ వారికి మంచి హ్యాట్రిక్ విజయాన్ని తెచ్చుపెడుతుందని భావిస్తున్నారు.  ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  గతంలో మహేష్, పూజ కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చిన విషయం తెలిసిందే..

తన సినిమా టైటిల్ విషయంలో గురూజీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎవరు ఊహించలేని టైటిల్స్ ను నిర్ణయిస్తూ టైటిల్ తోనే అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. అత్తారింటికి దారేది సినిమా ను అలా నిర్ణయించి టైటిల్ తోనే హిట్ అందుకున్నారు. అలా ఈ సినిమా కి అయోధ్య లో అర్జునుడు అనే సినిమా టైటిల్ ను పెట్టబోతున్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే త్రివిక్రమ్ మరో వెరైటీ టైటిల్ ను పెట్టినట్లే అని చెప్పాలి. వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 28 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. బాలీవుడ్ హీరో ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: