యువ హీరో అల్లు శిరీష్.. హీరోయిన్ అను ఇమ్మానియేల్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజేత సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేస్తున్నారు. నేటి యువతరం భావాలకు అనుగుణంగా ఈ సినిమా కథను ఒక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు అప్డేట్లు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది.


ఇక ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం పలు సన్న హాలు చేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన ఊర్వశివో రాక్షసివో సినిమా చిత్రం నుండి దింతన అనే పాటను కూడా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా మేకర్ వదిలిన ఒక బ్యూటిఫుల్ పోస్టర్ వైరల్ గా మారుతోంది. ఇందులో అల్లు శిరీష్ మరియు అను ఇమ్మానియేల్ జంట రొమాన్స్ మూడ్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది ఇద్దరు కూడా ఒకే కారులో ప్రయాణిస్తూ ఉన్నారు.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి అనుప్ రూప్స్ ,అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన GA-2 పిక్చర్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కించారు. అంతేకాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఊర్వశివో రాక్షసివో.. సినిమా వచ్చే నెల-4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అల్లు శిరీష్ ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ చిత్రంతో సక్సెస్ అవుతారమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: