ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇంకొక భాషలో
రీమేక్ చేయడం ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది. చాలా సినిమాలు ఒరిజినల్ భాషలో ఆయన దాని కంటే
రీమేక్ చేసిన భాషలోనే సూపర్ హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా
రీమేక్ సినిమా చేయడం చాలా సులువు అనే అభిప్రాయానికి చాలా మంది వచ్చారు. అయితే ఫోను ఫోను
రీమేక్ సినిమా చేయడం అంత సులువు కాదని ఒరిజినల్ కు మించి సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా చేయడం
కత్తి మీద సామూలాంటిదే అని చాలామంది చెప్పుకొచ్చారు .
ఆ విధంగా ఇప్పుడు తెలుగులో చాలా మంది అగ్ర హీరోలు
రీమేక్ సినిమాలు చేయగా వాటి ద్వారా విజయాలను ఏమాత్రం అందుకోలేక పోయారు అనే చెప్పాలి. ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ విధంగా
రీమేక్ సినిమాలకు కాలం చెల్లిపోయింది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన
గాడ్ ఫాదర్ సినిమా మలయాళం లో రూపొందిన లూసిఫర్ చిత్రానికి
రీమేక్ గా తెరకెక్కింది.
ఈ చిత్రం తెలుగులో భారీ స్థాయిలో నష్టపోవడం మెగా అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది ఒక
రీమేక్ సినిమాను చేయడం వలన ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది అని మెగా అభిమానులు నమ్ముతున్నారు. అలా కాకుండా డైరెక్ట్
సినిమా చేస్తే తప్పకుండా
చిరంజీవి విజయం అందుకునే వాడని వారు చెబుతున్నారు. ఈ
సినిమా మాత్రమే కాకుండా విశ్వక్సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా
సినిమా కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అంత కు ముందు పవన్
కళ్యాణ్ నటించిన
రీమేక్ సినిమాలు కూడా పెద్దగా మెప్పించకపోవడం ఈ రకమైన సినిమాలను ఇక చేయడం ఆపేస్తే మంచిదని అనుకుంటున్నారు. మరి పవన్
కళ్యాణ్ వరసగా
రీమేక్ సినిమాలు చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో ఆయన భవిష్యత్తులోనైనా ఇలాంటి సినిమాలను చేయకుండా ఆపుతారా అనేది చూడాలి.