‘ఆచార్య’ విడుదల అయ్యేంతవరకు కొరటాల కు అపజయం అన్నపదం తెలియదు. దీనికితోడు ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ అందరి హీరోలతోనూ మంచి సాన్నిహిత్యాన్ని కొరటాల కొనసాగిస్తూ వచ్చాడు. కేవలం ‘ఆచార్య’ పరాజయం కొరటాల గ్రాఫ్ ను ఒక్కరోజులో కిందకు జారిపోయేలా చేసింది. చిరంజీవి లాంటి టాప్ హీరో కొరటాల ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ‘ఆచార్య’ పరాజయాన్ని అతడి ఖాతా లోకి తోసివేస్తే ఖండించలేక మౌనంగా తన పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ను భరిస్తూ వచ్చాడు.


‘ఆచార్య’ విడుదల అవ్వక ముందే జూనియర్ కొరటాల మూవీ ఫిక్స్ కావడమే కాకుండా ఆమూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని కొరటాల అప్పటికే ఆమూవీ కథ రెడీ చేసుకున్నప్పటికీ ‘ఆచార్య’ పరాజయంతో ఎలర్ట్ అయిన జూనియర్ ఆమూవీ కథను ఒకటికి రెండు సార్లు మారుస్తూ వచ్చాడు అని అంటారు. ఈ గ్యాప్ లో అసలు కొరటాల జూనియర్మూవీ క్యాన్సిల్ అయింది అంటూ విపరీతమైన నెగిటివ్ ప్రచారం మొదలైంది.


అయితే వాస్తవం వేరు ఈమూవీకి సంబంధించి ఇండస్ట్రీలో ప్రసిద్ధిగాంచిన టెక్నిషియన్స్ సబు సిరిల్ రత్నవేలు శ్రీకర్ ప్రసాద్ లతో పాటు అనిరుద్ రవిచందర్ లు పని చేస్తున్నారు. ఈమూవీని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా పెట్టడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇన్ని భారీ ఏర్పాట్లు ఒకవైపు జరుగుతూ ఉంటే జూనియర్ కొరటాల మూవీ ఆగిపోయింది అంటూ కొందరు ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ కొరటాల సన్నిహితులు చాల ఆశ్చర్యపడుతున్నట్లు టాక్. ఈసినిమా షూటింగ్ ను ఈ న్ర్లలో ప్రారంభించి ఎట్టి పరిస్థితులలోను వచ్చే ఏడాది జూన్ లో విడుదల చేయాలని కొరటాల స్థిర నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్నా ఈమూవీ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి..
మరింత సమాచారం తెలుసుకోండి: