ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ మంచి ప్రేక్షకు ఆదరణ పొందిన విషయం తెలిసిందే.ఇప్పటికే హిందీలో 17వ సీజన్ జరుపుకుంటున్న ఈ షో.. తెలుగులో ఆరవ సీజన్ జరుపుకుంటుంది.. అంతేకాదు తమిళ్ లో కూడా బిగ్ బాస్ సీజన్ కు మంచి ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా తమ టాలెంటును బయట పెడుతూ తమ స్ట్రాటజీని చూపిస్తున్నారు. నిజానికి సోషల్ మీడియా ద్వారా సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్న సెలబ్రిటీలు బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో తమ అదృష్టాన్ని మార్చుకొని.. భారీ పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చాలామంది బుల్లితెర సోషల్ మీడియా స్టార్లు కూడా వెండితెరపై గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే దానికి కారణం బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతసేపు కంటెస్టెంట్ల మధ్య పోటాపోటీ ఎలిమినేషన్,  నామినేషన్స్ అన్నీ కూడా రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే తమ ఆట తీరు బాగా లేకపోయినా.. ప్రేక్షకుల నుంచి ఓట్లు పడకపోయినా ఎలిమినేట్ అవ్వాల్సిందే. అయితే ఈసారి ఊహించని విధంగా ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళ్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్  లో ఒక కంటెస్టెంట్ ను సేవ్ చేసింది. తాజా గా జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ తన తమ్ముడు మణికందన్ కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.


అయితే చివరి నిమిషంలో మణికందన్  ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఐశ్వర్య రాజేష్ తన పీ ఆర్ టీమ్ తో  ఎక్కువ ఓట్లు పడేలా చేసి ఎలిమినేషన్ నుంచి మణికందన్ ను సేఫ్ చేసింది. మొత్తానికి అయితే అక్క పీ ఆర్ టీమ్ తో మణికందన్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడని చెప్పవచ్చు.. మరి మిగతా ఎపిసోడ్స్ లో ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: