బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా స్టార్ టీమ్ ఇండియా క్రికెటర్ పంత్ కి మధ్య ఉన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ గతంలో ఇష్టపడడం కూడా జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకున్నారని ప్రచారం కూడా జరిగింది.కానీ ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు మీడియా లో మాత్రం వార్తలు బాగా వైరల్ గా మారాయి. రిషబ్ పంత్ ఆ మధ్య సోషల్ మీడియాలో ఊర్వశిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఆ వెంటనే పదే పదే ఊర్వశి తన సోషల్ మీడియా నుంచి రిషబ్ పంత్ గురించి పలు రకాలుగా ప్రస్తావించడం జరిగింది.


దీంతో ఈ వ్యవహారం మరింత పాపులారిటీ అయింది. దీంతో బాలీవుడ్ తో పాటు ఇతర భాషలలో కూడా ఈ ముద్దుగుమ్మ పలు అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజగా మిస్టర్ ఆర్పి అంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చాలామంది రిషబ్ పంత్ గురించి అనుకున్నారు. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ నేను ఆర్ పి అంటూ పోస్ట్ చేసింది రామ్ పోతినేని గురించి అతడు నా సహనటుడు అయితే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే రిషబ్ పంతు కూడా ఆర్పి అంటారట. అంటూ కామెంట్ చేయడం జరిగింది.


రిషబ్ పంతుని కూడా ఆర్పి అంటారని తెలియక నేను అలా పెట్టాను కానీ నా ఉద్దేశం వేరు నేను పెట్టింది వేరు అంటూ రామ్ పోతినేని గురించి అన్నట్లుగా తెలియజేసింది. దీంతో మరొకసారి ఊర్వశి షేర్ చేసిన ఈ పేరుతో రామ్ పోతినేని పేరుడి వివాదాల్లోకి లాగబోతోంది. మరి ఈ వ్యవహారం పై హీరో రామ్ ఎలా స్పందిస్తారు చూడాల్సి ఉంది.ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: