తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి సాయి దరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి దరమ్ తేజ్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆఖరుగా సాయి దరమ్ తేజ్ "రిపబ్లిక్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. దేవ కట్ట దర్శకత్వం లో తేరకెక్కిన ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ ద్వారా సాయి దరమ్ తేజ్ కు దేవా కట్టా కు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం సాయి దరమ్ తేజ్ , కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. 

దానితో ఈ మూవీ సాయి దరమ్ తేజ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం "ఎస్ డి టి 15" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ నిన్న ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ టైటిల్ గ్లిమ్స్ విడుదలకు ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ ను డిసెంబర్ 7 వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రసాద్ లార్జ్ స్క్రీన్ లో , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: