
ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ని తాజాగా ప్రోమోతో విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమా టైటిల్ కంగువా అని సూర్య 42 చిత్రంగా ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమా టైటిల్ పూర్తి విషయానికి వస్తే కంగువా అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి మరియు అత్యంత పరాక్రమంతుడు అని అర్థం వచ్చే విధంగా ఈ సినిమా టైటిల్ ని పెట్టినట్లు సమాచారం అన్ని భాషల్లో కామన్ టైటిల్ ఉండేలా దీనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కంప్లీట్ త్రీడి విజువల్ తో ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వార్ సీక్వెన్స్ అన్ని కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు తాజాగా టైటిల్ ప్రోమోకి కూడా ఎవ్వరూ ఊహించని స్థాయిలో మ్యూజిక్ అందించారు దేవిశ్రీప్రసాద్. ఇలాంటి పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాన్ని కెరియర్లో మొదటిసారి దేవిశ్రీప్రసాద్ ఇలాంటి సంగీతాన్ని అందిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు ఈ సినిమా యావశాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది మిగిలిన సీక్వెన్స్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే విడుదల తేదీని కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.