టాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపుగా 5 దశాబ్దాలుగా పరిశ్రమను కొనసాగుతున్న నరేష్ కి వందల కోట్ల ఆస్తి ఉందని తెలుస్తోంది. దిగవంతన్నటి జయం నిర్మల కొడుకు అయిన ఈయన బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం టీనేజ్లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. అనంతరం హీరోగా పలు సినిమాలలో నటించినప్పటికీ హీరోగా ఫేడ్ ఔట్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. ఆయనకి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. 

ఒక్క సినిమాలో నటించేందుకు దాదాపుగా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటాడు నరేష్ .ఇకపోతే ఈయనకి ముగ్గురు భార్యలు అన్న సంగతి మనందరికీ తెలిసిందే .ప్రస్తుతం తన మూడవ భార్య రమ్య రఘుపతితో వివాదం నడుస్తోంది. ఇకపోతే తన తల్లి విజయనిర్మల దగ్గర నుండి ఆయనకి పెద్ద మొత్తంలో ఆస్తులు వచ్చాయట. దాంతోపాటు ఆయన నటుడుగా కూడా చాలానే సంపాదించాడు.  నరేష్ శిరచర ఆస్తుల విలువ దాదాపుగా వందల కోట్లలో ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న మళ్లీ పెళ్లి సినిమాకి సంబంధించిన

ట్రెయిలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇకపోతే తన మూడో భార్య రమ్య రఘుపతితో గొడవలు ఏంటి నటి పవిత్ర లోకేష్ అతని జీవితంలోకి ఎలా వచ్చింది? ఆయన జీవితంలోని కీలకంగా మారిన  రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ లతో చోటుచేసుకున్న సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు నరేష్. ట్రైలర్ టీజర్ చూశాక ఈ విషయం అర్థం అవుతోంది. దీంతో నరేష్ మన ఊహలకు అందని కోటీశ్వరుడు అనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక మళ్లీ పెళ్లి సినిమా విడుదలై రానున్న కాలంలో సంచలనాలకు వివాదాలకు వేదికగా మారడం ఖాయమని అంటున్నారు ఈ సినిమా ట్రైలర్ చూసిన వారందరూ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: