మిల్కీ బ్యూటీ తమన్న గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు గత 17 ఏళ్ల నుంచి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన అంతం అభినయంతో ఇప్పటికి కోట్లు మంది కుర్రాళ్ల మనసులు దోచుకుంది అని చెప్పాలి. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న స్టార్ హీరోలు అందరు సరసన నటించింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడటంతో అడపాదడపా అవకాశాలను మాత్రమే అందుకుంటుంది. ఇలాంటి సమయంలోనే అటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీ బిజీగానే గడుపుతుంది ఈ ముసుగుమ్మ. ఇక ఎంతోమంది హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది అని చెప్పాలి.


 అయితే 17 ఏళ్ల సినీ కెరియర్ లో డేటింగ్లకు దూరంగా ఉన్న తమన్న ఇప్పుడు మాత్రం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో మునిగి తేలుతూ వార్తల్లో తెగ హాట్ టాపిక్ మారిపోతుంది అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలలో నటించింది. ఇక తమన్నా మొదటిసారి ఇంటిమేట్ సీన్లలో  నటించడం చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇకపోతే విజయ్ వర్మ తన ప్రేయసి తమన్నను ఏకంగా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది అనే విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల చేయగా ఇందులో కావాలా అంటూ కోర చూపులతో తమన్నా రొమాంటిక్ డాన్స్ చేస్తూ కనిపించింది. ఇక అక్కడక్కడ ఊరు మాస్ స్టెప్పులు కూడా వేసింది. దీంతో ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ పాట గురించి స్పందించిన విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ పాటకు సంబంధించిన ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ.. పాట ఫైర్ పుట్టిస్తుంది.. సినిమా దేవుడు దేవత అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. రజినీకాంత్ ను సినిమా దేవుడు అంటే పర్లేదు కానీ తమన్నాను మరి అంత ఆకాశానికి ఎత్తేయడం  అవసరమా అంటు నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: