ఆగస్టు 11వ తేదీన భోళాశంకర్ అనే సినిమా తెలుగు భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫ్లాప్ అని రెండు మూడు రోజులకే ప్రేక్షకులు డిసైడ్ చేసేసారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటించ్చింది. కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో నటించింది. ఇది తమిళ హిట్ మూవీ వేదాళం సినిమాకు తెలుగు రిమేక్ అని చెప్పాలి అయితే ఇక ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రైలర్ను కూడా విడుదల చేశారు. ఈనెల 25వ తేదీన ఇక హిందీలో గ్రాండ్గా బోళా శంకరును విడుదల చేయబోతున్నారట. ఈ క్రమంలోనే హిందీ బోళా శంకర్ లో చిరంజీవి పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. కాగా మెగాస్టార్ చిరంజీవి జాకీశ్రాఫ్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే స్నేహితుడి గొంతుతోనే చిరంజీవి బాలీవుడ్ లో బోళా శంకర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మరోవైపు జాకీశ్రాఫ్ గొంతు బాలీవుడ్ లో ఎమోషన్ అని చెప్పొచ్చు. ఇక చిరంజీవి గ్రేస్ లుక్స్ కామెడీ టైమింగ్ సత్తా ఏంటో ఇప్పటికి బాలీవుడ్ జనాలకు పెద్దగా తెలియదు. మరి ఇప్పుడు బోలాశంకర్ హిందీలో ఎలా సత్తా చాటుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి