తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో భాషలలో సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ధనుష్ తెలుగు దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే మూవీ లో హీరో గా నటించి ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. 

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ "కెప్టెన్ మిల్లర్" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సందీప్ కిషన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓవర్సీస్ థియేటర్ హక్కులను లైకా ప్రొడక్షన్ సంస్థ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ వైరల్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: