బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన తార , షారుక్ కి జోడిగా నటించగా ... ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో ప్రియమణి నటించింది. విజయ్ సేతుపతిమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీమూవీ కి దర్శకత్వం వహించగా ... ఈ మూవీ ని రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుక్ ఖాన్ స్వయంగా నిర్మించాడు.

ఇకపోతే ఈ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా వెయ్యి కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ లాంజ్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ ఆఫర్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక టికెట్ ను కొనుగోలు చేసినట్లు అయితే మరో టికెట్ ను ఫ్రీ గా ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ఇలా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబందించిన ఇలా ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ గా ఇవ్వనున్నట్లు ఆఫర్ ప్రకటించడంతో ఈ మూవీ కి మరి కొంత కాలం మంచి కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఇప్పటికే పటాన్ మూవీ తో ఈ సంవత్సరం వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ లను అందుకున్న షారుఖ్ ఈ సంవత్సరం జవాన్ మూవీ తో రెండ వసారి 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: