ఈ మధ్యకాలంలో ఇతర భాషలలోని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. అలా టాలీవుడ్ సినిమాలు కూడా ఇతర భాషలలో విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి.. అయితే ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాలు సైతం రెండు తెలుగు రాష్ట్రాల ఎక్కువగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు చాలా తక్కువగానే ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం



బాలీవుడ్ స్టార్ హీరోగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 56 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆలియా భట్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఇందులో అమితాబ్ బచ్చన్ ,నాగార్జున తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటించిన రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 31 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇటీవలే విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ముఖ్యంగా ఈ సినిమా అని తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 76 కోట్ల రూపాయలకు పైగా రాణించింది.


తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులు వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ సినిమా అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా రష్మిక హీరోయిన్గా నటిస్తూ ఉన్నది ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లో సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: