
రీ రికార్డింగ్ తోనే మన హీరోని లేపలేము హాయిగా వెళ్ళామా డబ్బులు తీసుకున్నామా అలా ఉండడం తనకి ఇష్టం ఉండదని సినిమా ఆడాలి ఫైట్ చేయాలి ఒళ్ళు హూనం అవ్వాలి అప్పుడే తనకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుందని చిరంజీవి తెలిపారు.అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ కామెంట్స్ మాత్రం రజనీకాంత్ ను ఉద్దేశించి అన్నారు అంటూ పలువురి నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో హీరో సన్నివేశాలని కేవలం అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే హైలెట్ చేశారు.
ఒకవేళ చిరంజీవి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడారా అంటూ పలువురు అభిమానులు సైతం తెలుపుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తన 157వ సినిమాని చేయబోతున్నారు..156 చిత్రాన్ని కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ప్రకటించారు. ఈ సినిమాకి చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా కూడా రీమిక్ అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అందుచేతనే ఈ సినిమాని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం.