కీడా కోలా సినిమా అయితే అమెరికాలో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఓవర్సీస్ నుంచే ఈ సినిమా మూడు కోట్లుకు పైగా ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం తెలుస్తుంది.మొత్తంగా మొదటి రోజు 5.5 కోట్లు గ్రాస్ కీడాకోలా సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకా అలాగే సత్యంరాజేష్ మెయిన్ లీడ్ పోషించిన పొలిమేర-2 సినిమా కూడా కొన్ని మంచి సెంటర్లలో బాగానే రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపించింది.ఈ సినిమా మొదటి రోజు దాదాపు ₹2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం తెలుస్తుంది. అయితే ₹ 3 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ఈ సినిమా నిర్మాతలు చెబుతున్నారు. ఇందులో కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది.
ఏది ఏమైనా ఈ రెండు సినిమాలకు ఇది చాలా మంచి శుభారంభం అని చెప్పాలి. ఇక వీకెండ్ కాబట్టి రెండు సినిమాలకు ఆక్యెపెన్సీ పెరుగుతుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ రెండు సినిమాలు జనాల్లోకి వెళ్లాయి. ఇక వీటికి బూస్టింగ్ గా ప్రచారం అవసరం. ఈ రెండు సినిమాలకు మేకర్స్ వీలైనంత వరకూ గట్టి ప్రచారం తేగలిగితే మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఈ రెండు సినిమాలు అసలైన పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి