
ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది.. అధికారంలో ఉన్న కేసీఆర్ ను గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం మాధవిలతా కి అంతగా నచ్చలేదన్నట్లుగా తెలియజేస్తోంది. తాజాగా కాంగ్రెస్ గెలుపు పైన మాధవి లత చేసిన పోస్ట్ తీవ్రదుమారాన్ని రేపేలా కనిపిస్తున్నది.. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో తెలంగాణలో రావణ రాజ్యం రాబోతోంది అంటూ ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేస్తూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ చూసి ప్రతి ఒక్కరూ సైతం ఆశ్చర్యపోతున్నారు.
మాధవి లత తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో జరగబోయే దారుణాలు ఇవే అంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది .ముఖ్యంగా ఫుడ్ ఉండదు, ఉద్యోగాలు ఉండవు ,మహిళలకు భద్రత అనేది ఉండదు, శాంతి అనేలా ఉండదు. ఎంజాయ్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ లవర్స్ అంటూ ఒక గుడ్ లక్ రావణ సామ్రాజ్యం మొదలు అంటూ కాంగ్రెస్తో పోలిస్తే బీఆర్ఎస్ కి తన సైడు నుంచి 99 మార్కులు అంటూ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ మద్దతుదారులు ఈమె పైన చాలా దారుణంగా టోల్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని సైతం ఎవరైనా గౌరవించాలని కనీస జ్ఞానం లేదా అంటూ ఈమె పైన ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్ట్ వైరల్ గా మారుతున్నది.