త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే గుర్తింపును సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఇక మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టేసాడు రామ్ చరణ్.


 ఉప్పెన అనే సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని సాధించిన డైరెక్టర్ బుచ్చి బాబు సన తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్తో ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ మూవీ టైటిల్ ఏంటి అనే విషయంపై అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక బుచ్చిబాబు చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో గ్లోబల్ స్టార్ సరసన ఎవరు హీరోయిన్గా అవకాశం దక్కించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 గత కొంతకాలం నుంచి ఎంతోమంది హీరోయిన్ల పేర్లు తెరమీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది ఈ బాలీవుడ్ హీరోయిన్. అయితే ఇక ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది.అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జోడి ఇండస్ట్రీలో ఫేవరెట్ జోడీగా కొనసాగింది. వీరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు చిరంజీవి వారసుడు చరణ్ శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్ కలిసి నటిస్తుండడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: