నందమూరి నట సింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఏ డైరెక్టర్ మోక్షజ్ఞను పరిచయం చేస్తారా అని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చ జరుగుతుంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని వార్త షికారు చేస్తుంది. అతను ఎవరో మీకు అర్థమైంది కదూ .. ఎస్ మీరు విన్నది నిజమే..మోక్షజ్ఞని డైరెక్టర్ అనిల్ రావిపూడితో లాంఛ్ చేయిస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తోనే తన కొడుకు మొదటి సినిమాను లాంఛ్ చెయ్యాలని భావిస్తున్నారట. మోక్షజ్ఞ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నట్లు సమాచారం. స్టోరీని స్వయంగా బాలయ్యే ఫైనల్ చేయబోతున్నారని టాక్..తన కొడుకు మొదటి సినిమా మాస్ డైరెక్టర్ తో ఉంటె తన కెరీర్ కు ప్లస్ అవుతుందని బాలయ్య భావిస్తున్నారు. అందుకే బోయపాటిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే బోయపాటి ఊరమాస్ ఎఫెక్ట్‌లు, నరుకుడు బాలయ్యకి అయితే ఒకే కానీ మోక్షజ్ఞకు షూట్ అవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బోయపాటి , మోక్షజ్ఞ సినిమా అంటే ఇండస్ట్రీ షేక్ అవుతుందని అనుకుంటున్నారు.. ఈ ఏడాదిలోనే సినిమా మొదలు కాబోతుందని సమాచారం..బోయపాటి పైనే బాలయ్య భారం వేసినట్లు వినికిడి. టాలీవుడ్ లో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా వీరి కాంబోలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' అనే మూడు సినిమాలు రాగా.. మూడూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.నాలుగోసారి కూడా చేతులు కలపడానికి రెడీగా ఉన్నారు. బోయపాటి ప్రతిభపై బాలయ్యకు ఎంతో నమ్మకం. పైగా బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో లాంచ్ చేయిస్తే.. మోక్షజ్ఞ మొదటి నుంచో మాస్ లోకి బలంగా చొచ్చుకొని పోతాడని బాలకృష్ణ భావిస్తున్నారట.అందుకే మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యత బోయపాటికి అప్పగించారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని అంటున్నారు. దీంతో తన సినిమాల్లో బాలయ్యని ఓ రేంజ్ చూపించే బోయపాటి.. మోక్షజ్ఞను ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: