మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ స్టార్ హీరోగా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కియార కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతోంది. పొలిటికల్ యాక్షన్ సినిమా తెలుగు ఈ సినిమాకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించారు చిత్రబృందం. ఈ క్రమంలోనే షూటింగ్ నుండి లీక్ అయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

గత రెండు రోజులుగా రాంచరణ్ కియారా లీక్ అయిన ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. లీక్ లను కంట్రోల్ చెయ్యటానికి టిమ్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కంట్రోల్ కావటం లేదు. ఏదేమైనప్పటికీ, అభిమానులు కియారా ఒక్క న్యూ లుక్ తో సంతోషం వ్యక్తం చేసింది.సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ లో అంజలి,శ్రీకాంత్, sj సూర్య తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.

ఇక రామ్ చరణ్ లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజెర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశాడు . ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు సినిమాల విషయంలో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు .అలా ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: