టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన భారీ అంచనాలతో విడుదలైంది.సూపర్ హిట్ కాంబో కావడంతో అటు ఫ్యాన్స్ తోపాటు ఇటు సినీ ప్రియులు కూడా మూవీపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో రివ్యూస్ రాబట్టలేకపోయింది.ఫస్ట్ షో నుంచి మిక్స్ డ్ టాక్ సంపాదించుకుందీ ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. అయితే రివ్యూల విషయం పక్కన పెడితే.. వసూళ్ల పరంగా సూపర్ స్టార్ మహేష్ మాత్రం రికార్డు సృష్టించారు. తన వన్ మ్యాన్ షోతో సినిమాని నడిపించాడు. ఐదు రీజనల్ సినిమాలతో 100 కోట్ల పైగా షేర్ 200 కోట్ల పైగా దక్కించుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డు క్రియేట్ చేశారు. సంక్రాంతి సెలవుల్లో మోస్తరు వసూళ్లు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ హిట్ గా నిలిచింది.థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది గుంటూరు కారం సినిమా. అక్కడ పలు రికార్డులు కూడా ఈ సినిమా క్రియేట్ చేసింది.


చాలా రోజులుగా ఓటీటీ టాప్ లిస్ట్ లో కూడా నిలిచింది. ముఖ్యంగా హిందీ, తమిళ్ వెర్షన్ లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. మాస్ రోల్ లో మహేశ్ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను చాలా బాగా ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా అమెరికాలో మాత్రం నష్టాలు చవి చూసింది. అక్కడ మూడు మిలియన్ల మార్క్ ఈజీగా క్రాస్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్  కంప్లీట్ చేసుకోలేదని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా బయర్స్ లాభాలు పొందారు. కొన్ని ఏరియాల్లో అయితే భారీ లాభాలు వచ్చాయి. సో ఓవరాల్ గా ఈ సినిమా  250 పైగా కోట్ల గ్రాస్, 130 కోట్ల షేర్ రాబట్టి లాస్ కాకుండా బయటపడింది.తాజాగా ఈ విషయంపై గుంటూరు కారం నిర్మాత నాగవంశీ ఓ కార్యక్రమంలో స్పందించడం జరిగింది. గుంటూరు కారం మూవీతో మీడియా డిస్సపాయింట్ అయిందని, మేకర్స్ కాదని ఓ జర్నలిస్ట్ కి రాడ్డు లాంటి రిప్లై ఇచ్చాడు. వంశీ రిప్లై కి ఆ జర్నలిస్ట్ మొహం మాడిపోయింది. పాపం అతడికి వంశీ రిప్లై తో అందరిముందు పరువు పోయినట్టు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: