రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరో గా నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత చరణ్ ... చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య మూవీ లో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ ఇందులో చరణ్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్ "గేమ్ చేంజర్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. కాకపోతే ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ చిత్ర బృందం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ నిన్న అనగా మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "జరగండి" అంటూ సాగే పాటను విడుదల చేసింది.

దీనికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే నిన్న మెగా అభిమానులు చరణ్ పుట్టిన రోజు ఈవెంట్ ను నిర్వహించారు. దానికి దిల్ రాజు కూడా విచ్చేశాడు. ఆ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు మరికొన్ని రోజుల్లోనే గేమ్ చెంజర్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలియజేశాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: