టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే గతంలో విజయ్ , పరుశురామ్ కాంబో లో గీత గోవిందం అనే మూవీ రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబో లో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గోపి సుందర ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను కూడా విడుదల చేసింది.

వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం నిన్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాతం ఆకట్టుకునే విధంగా ఉండడం ... అలాగే ఈ మూవీ ట్రైలర్ లో కొన్ని ఫన్నీ సన్నివేశాలు ... కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయం లో 3.68 మిలియన్ వ్యూస్ ను ... 200 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd