తెలుగు లో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈయన కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం సిద్దు పక్క యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ డీజే టిల్లు లో హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం అలాగే ఇందులో ఈయన తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో , డైలాగ్ డెలివరీతో , డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు.

ఇక ఈ మూవీ తర్వాత నుండి ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా సిద్దు "డీజే టిల్లు" మూవీ కి కొనసాగింపుగా రూపొందిన "టిల్లు స్క్వేర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా మార్చి 29 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.

ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కనెక్షన్ లు లాంగ్ రన్ లో లభించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క థియేటర్ రన్ కొన్ని వారాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: