గత మూడు నెలలుగా సినిమాలను పట్టించుకోని ప్రేక్షకులకు మళ్ళీ సినిమాల పై మోజు పుట్టేలా లేటెస్ట్ గా జరిగిన ‘కల్కి 2898’ ఈవెంట్ జరగడంతో ఈమూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఈవెంట్ లో జరిగిన ‘బుజ్జి’ లాంచ్ లో ప్రభాస్ ను పరిచయం చేసిన విధానం ప్రభాస్ స్పీచ్ కేవలం అతడి అభిమానులకు మాత్రమే కాకుండా అందరికీ విపరీతంగా నచ్చింది.ముఖ్యంగా కమల్ హాసన్ అమితాబ్ ల పట్ల ప్రభాస్ చూపించిన మర్యాద గౌరవం అందర్నీ ఆకర్షించింది. కమలహాసన్ గురించి మాట్లాడుతూ తన చిన్నతనంలో ‘సాగరసంగమం’ సినిమా చూసినప్పుడు ఆమూవీలో కమల్ డాన్స్ తనకు ఎంతో నచ్చిందనీ అలా డాన్స్ చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించినా అప్పట్లో కుదరక పోవడంతో ఆమూవీలో కమల్ వేసుకున్న డ్రెస్ వేసుకుంటే డాన్స్ అదేవిధంగా వచ్చే స్తుందని తాను భావించి అలాంటి డ్రెస్ తనకు కావాలని తన తండ్రి దగ్గర అదేవిధంగా తన పెద నాన్న వద్ద గారాబం పోయి ఆ డ్రెస్ కొనిపించుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.ఆతరువాత ఆ డ్రెస్ ను తాను వేసుకుని ఎన్ని సార్లు ప్రయత్నించినా తాను కమల్ లా ఒక్క స్టెప్ కూడ వేయలేకపోయియను అన్న విషయాన్ని వివరిస్తూ తాను ఆ కమల్ హాసన్ తో ఒక సీనిమాలో కలిసి నటిస్తాను అని కలలో కూడ అనుకోలేదు అన్న విషయాన్ని ఎటువంటి భేషజం లేకుండా ప్రభాస్ వివరించడంలో అతడి వినమ్రత కనిపిస్తోంది అంటూ చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఇదే ఈవెంట్ లో ప్రభాస్ అమితాబ్ దీపికా పదుకునె పట్ల కూడ చాల గౌరవంగా ప్రస్తావిస్తూ వారి పై చేసిన ప్రశంసలు కూడ ప్రభాస్ సంస్కారాన్ని సూచిస్తున్నాయి అంటూ డార్లింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి. అత్యంత ఘనంగా జరిగిన ‘బుజ్జి’ టీజర్ లాంచ్ తో ‘కల్కి’ మూవీ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఊహించిన విధంగా ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే ‘బాహుబలి’ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం అంటూ ప్రభాస్ అభిమానుల అంచనా..

మరింత సమాచారం తెలుసుకోండి: