ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కల్కి’ మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఈమూవీ ప్రమోషన్ ను ప్రారంభించారు. ఈమూవీ హాలీవుడ్ స్టైల్ లో తీసిన సైన్స్ ఫిక్షన్. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి కథతో ఒక భారీ సినిమా ఇంతవరకు రాలేదు. అయితే మాస్ ప్రేక్షకులు ఎక్కువగా సినిమా చూస్తే కాని ఘన విజయం లభించని ప్రస్తుత పరిస్థితులలో ఎంతవరకు సగటు ప్రేక్షకుడు ‘కల్కి’ మూవీ కథతో కనెక్ట్ అవుతాడు అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి.గతంలో విడుదలయిన ‘కల్కి’ ఫస్ట్ లుక్ అప్పట్లో ఎంత ట్రోలింగ్‌కు గురైందో అందరికీ తెలిసిందే. ఆతర్వాత వచ్చిన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై అంచనాలు బాగా పెరిగాయి. ఇక లేటెస్ట్ గా ఈమూవీకి సంబామధించిన ముఖ్య పాత్ర ల డిజైన్ చేయబడ్డ బుజ్జి అనే అల్ట్రా మోడర్న్ కారును ప్రేక్షకులకు పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ కు అభిమానుల  నుండి స్పందన బాగానే వచ్చినప్పటికీ ఆ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు టెన్షన్ పెడుతోంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.  ఈ ఈవెంట్‌ కు సెలక్టివ్‌గా అభిమానులను అలాగే మీడియా  ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. కానీ ఈ ఈవెంట్ అనుకున్న స్థాయిలో ట్రెండింగ్ అవ్వలేక పోయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి భారీ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ అనగానే సోషల్ మీడియా హోరెత్తి పోవాలి. అయితే అలాంటి హోరు సోషల్ మీడియాలో కనిపించక పోవడంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్. దీనితో సినిమాల ప్రమోషన్ విషయంలో రాజమౌళి అనుసరించే వ్యూహాలు ‘కల్కి’ టీం అనుసరిస్తే బాగుంటుంది అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ‘బాహుబలి’ రికార్డులను ఈమూవీ బ్రేక్ చేయాలి అంటే రానున్న నెలరోజులు ‘కల్కి’ మ్యానియాతో దద్దరిల్లి పోవాలి..  మరింత సమాచారం తెలుసుకోండి: