తమిళ స్టార్ హీరో ధనుష్‌  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ లైన్ అప్ తో బాగా బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. రాయన్, కుబేర, ఇళయరాజా బయోపిక్ చేస్తున్న ధనుష్ తాజాగా మంజుమెల్ బాయ్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చిదంబరంతో మూవీ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. దీంతో ధనుష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్‌ ప్రాజెక్ట్‌ ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్‌లో నటిస్తున్న రాయన్‌ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో సాగే గ్యాంగ్ స్టర్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ జూన్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంకా తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌ కూడా రిలీజ్ చేయనున్నారు. రాయన్ సెకండ్ సింగిల్‌ మే 24 వ తేదీన విడుదల కానుంది.అపర్ణ బాలమురళి ఇంకా సందీప్‌ కిషన్‌ మధ్య ఈ పాట రానుంది. డీ50వ (D50)గా తెరకెక్కుతోన్న రాయన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.


కాగా ఈ సినిమా ఆడియో లాంఛ్‌ను జూన్‌ 2న నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్‌సైడ్‌ టాక్ కాగా.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాయన్‌ సినిమాను తెలుగులో ఏసియన్‌ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ రిలీజ్ చేయనుంది.రాయన్‌ సినిమాకు ఆస్కార్‌ అవార్డ్ విన్నర్‌ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, విష్ణువిశాల్‌, కాళిదాస్ జయరామన్‌, సందీప్ కిషన్‌, సెల్వ రాఘవన్‌, ఎస్‌జే సూర్య ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ధనుష్‌ మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర సినిమా షూటింగ్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తరువాత ఇళయరాజా బయోపిక్ ఇంకా ముజుమ్మేల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరంతో సినిమా చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: