టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు (మే 20) సందర్భంగా ఒక్కరోజు ముందు అంటే గత వారమే మే 19 వ తేదీన దేవర సినిమా నుంచి ఫియర్ సాంగ్ వచ్చింది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటను తన మార్క్ బీట్‍తో అదరొగొట్టారు. రామజోగయ్య అందిందిన లిరిక్స్ కూడా చాలా పవర్‌ఫుల్‍గా సాగాయి. ముఖ్యంగా ఈ మ్యూజికల్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ విజువల్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఫియర్ సాంగ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ లో అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లలో దుమ్మురేపుతోంది.తాజాగా ఇప్పుడు ఈ పాట 60 మిలియన్ వ్యూస్ పైగా  సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు.


సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారని తెలియగానే ఈ మూవీ ఆడియో పై భారీ అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే దేవర సాంగ్ అదరగొట్టింది. యూ ట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఈ పాట స్పీడ్ గా దూసుకుపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రముఖ టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ తో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కొరటాల శివ ఆచార్య మచ్చని చెరిపి వేయడానికి ఈ సినిమాతో గట్టి హిట్టు కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టు అభిమానులు డిస్సపాయింట్ కాకుండా ఈ సినిమాని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ ఫియర్ సాంగ్ ఇంకా జోరు చూపిస్తోంది. ఇప్పటికీ ట్రెండింగ్‍లో కొనసాగుతోంది. దీంతో ఈ పాట ఖచ్చితంగా భారీ వ్యూస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: