కరోనా వైరస్ కాలంలో ఇంటిపట్టునే ఉండిపోయిన జనాలు సినిమా ఎంటర్టైన్మెంట్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నా సమయంలో ఓటీటిలు వినూత్నమైన వెబ్ సిరీస్లను అందుబాటులోకి తీసుకురావడంతో అందరూ కూడా ఓటీటిలకు తెగ కనెక్ట్ అయిపోయారు. ఆ భాష ఈ భాష అనే తేడా లేకుండా అన్ని భాషల వెబ్ సిరీస్ లను కూడా ఎంతో ఆసక్తిగా వీక్షించారు. అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా ఓటిటిలను అస్సలు వదలడం లేదు. ఎందుకంటే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పోల్చి చూస్తే అటు ఓటిటి కంటెంట్ మరింత డిఫరెంట్ గా సరికొత్తగా ఉంటూ ఉండటంతో.. ఈ కొత్త దానాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు.


 సినిమాలకు వెళ్లడమైన మానేస్తారేమో కానీ ఇక ఓటీపీ లో ఏదైనా కొత్తగా వెబ్ సిరీస్ విడుదలైంది అంటే చాలు ఆ సిరీస్ చూడకుండా అస్సలు ఉండలేరు. అయితే ఇలా ఓటిటిలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ హరర్ వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. ఇక ప్రేక్షకుల మైండ్ సెట్ కు తగ్గట్లుగానే ఓటిటి ప్లాట్ఫార్మ్స్ అలాంటి కంటెంట్ను తీసుకువస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని వెబ్ సిరీస్ లు అయితే ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక హారర్ మూవీనే అటు ఓటిటిలో దూసుకుపోతుంది. ది ఫస్ట్ ఒమెన్ అనే హారర్ మూవీ నెక్స్ట్ లెవెల్ లో రివ్యూ అందుకుంటుంది. మామూలుగానే హాలీవుడ్ లో ఒమెన్ ఫ్రాంచైజీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ ఫ్రాంచైజీ నుంచి ఆరో మూవీ గా ది ఫస్ట్ ఒమెన్ వచ్చింది. ముందుగా ఏప్రిల్ నాలుగవ తేదీన ఇటలీలో రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అనంతరం అమెరికాలో రిలీజ్ అయింది. ఇక మేము 30 నుంచి మన దగ్గర ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతూ ఇక మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది.  హాట్ స్టార్ లో ప్రస్తుతం ఈ హారర్ మూవీ అందుబాటులో ఉంది. అయితే కేవలం ఇంగ్లీషులో మాత్రమే ఈ హారర్ మూవీ చూసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ మూవీ లోని ట్విస్టులు త్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులు అందరినీ కూడా భయపెడుతాయి. ఒకరకంగా హారర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను సైతం సుస్సు పోయిస్తాయి. కేవలం ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ హారర్ మూవీ చూస్తే బెటర్ ఏమో అని చూసిన వాళ్ళ అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: