ఈ సంవత్సరం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ప్రజల దృష్టి కేవలం మూడే మూడు సినిమాల పై ఉంది. ఆలిస్టులో ‘కల్కి 2898’ ‘దేవర’ ‘పుష్ప 2’ లు ఉన్నాయి. ఈమూడు సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో కలక్షన్స్ వస్తాయి అన్న అంచనాలతో ఈమూడు సినిమాల పై వందల కోట్ల స్థాయిలో బిజినెస్ జరిగింది.‘కల్కి’ వచ్చే వారం విడుదల అవుతున్న నేపధ్యంలో ఈమూవీ సాధించే రికార్డుల పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీ తరువాత జూలై లో కమలహాసన్ శంకర్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘ఇండియన్ 2’ పై సగటు ప్రేక్షకులలో క్రేజ్ లేదు. దీనితో అందరి ఆశక్తి ఆగష్టు 15న విడుదల అవుతుంది అని ఇప్పటివరకు భావించిన ‘పుష్ప 2’ పై కొనసాగింది. అయితే ఇప్పుడు ఆసినిమా డిసెంబర్ కు వాయిదా పడటంతో ఆ డేట్ కు ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతోంది.అయితే ఈమూవీ పై పెద్దగా అంచనాలు లేవు. దీనితో సెప్టెంబర్ నెలాఖరున విదుడుల కాబోతున్న ‘దేవర’ పై అందరి దృష్టి ఉంటుంది. వాస్తవానికి మధ్యలో ‘పుష్ప 2’ వచ్చి ఉంటే ఆమూవీ ఫలితం తెలిసిన తరువాతా మాత్రమే  జనం ‘దేవర’ నామస్మరణం వచ్చేసి ఉండేవారు. అయితే ఇప్పుడు రేసులో ‘పుష్ప  2’ మాత్రమే ‘కల్కి’ తరువాత మిగిలి ఉంది.కానీ ఇప్పుడు ‘పుష్ప 2’ వాయిదా పడటంతో ‘కల్కి’ ‘కల్కి’ తరువాత జనం అంతా ‘దేవర’ గురించి మాత్రమే మాట్లాడుకునే ఆస్కారం ఉంది. దీనికితోడు ఈసినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ తెలుగురాష్ట్రలకు సంబంధించి ‘దేవర’ బిజినెస్ వందల కోట్ల స్థాయిలో జరగడం జూనియర్ ఎన్టీఆర్ స్థాయిని సూచిస్తోంది అంటూ తారక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ‘పుష్ప 2’ డిసెంబర్ కు  వాయిదా పడటం ఒక విధంగా ‘దేవర’ కు కలిసి వచ్చే కాలంగా మారింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: