ఇండియన్ సినీ ఇండస్ట్రీకి పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసింది ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు దర్శకధీరుడు రాజమౌళి మాత్రమే.. అలాంటి రాజమౌళి సినిమాల్లో నటించాలని ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.కానీ రాజమౌళితో సినిమాలు తీసే అదృష్టం అందరికీ రాదు. ఇక కొంతమంది అయితే చిన్న చిన్న పాత్రలు అయినా సరే రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే చాలు అని కలలుగంటారు. అయితే అలాంటి స్టార్ దర్శకుడు రాజమౌళికి ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమాల్లోకి చాలామంది ఇతర ఇండస్ట్రీల హీరోయిన్స్ వచ్చి స్టార్స్ అవుతారు.

అలా తెలుగులో ఇంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా రాజమౌళికి ఇష్టమైన ఏకైక హీరోయిన్ అనుష్క మాత్రమే.. అనుష్క లో ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీ నాకు ఇష్టమే.ఆమె సినిమాలలో చూపే సిన్సియారిటీ,డెడికేషన్ అంటే చాలా ఇష్టం.అంతకుమించి ఆమె తన వృత్తి పట్ల ఎంతో బాధ్యతగా ఉంటుంది.ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న అనుష్క మాత్రమే కాకుండా ఇవన్నీ క్వాలిటీస్ కలగలిపి ప్లస్ యాక్టింగ్ లో కూడా ఇష్టమైన మరో హీరోయిన్ సలోని.. అమ్మాయి కూడా హీరోయిన్స్ లో నాకు ఇష్టం అంటూ రాజమౌళి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఈ విషయం బయటపెట్టారు.

అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో మీకు ఎవరంటే ఇష్టమని అడగగా.. హీరోలందరిలో ఏ హీరో ఇష్టమో చెప్పే అంత మూర్ఖుడిని నేను కాదు అంటూ రాజమౌళి నవ్వేశారు. అలా టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా కూడా రాజమౌళి ఇష్టపడే హీరోయిన్లు అనుష్క, సలోని మాత్రమే.ఇక రాజమౌళి దర్శకత్వంలో అనుష్క  విక్రమార్కుడు, బాహుబలి 1,బాహుబలి 2 వంటి సినిమాల్లో నటించింది. ఇక సలోని రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా చేసిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలా ఈ ఇద్దరు హీరోయిన్లతో రాజమౌళికి మంచి బాండింగ్ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: