
ఇక ప్రస్తుతం గోవాలో హీరో , హీరోయిన్ల పై ఓ కీలకమైన పాటను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది .. అయితే ముందుగా సినిమాలో హీరోయిన్ పాత్రలో కరీనాకపూర్ ని తీసుకోవాలని అనుకున్నారు .. కానీ ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఈ సినిమా నుంచి ఆమెను తప్పించినట్టు తెలుస్తుంది .. అలాగే కరీనా హీరోయిన్ కాకపోయినా మరో కీలకమైన పాత్రలో నటించబోతుందంటూ ఇప్పటి వరకు పలు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఎప్పుడు ఆమె ఈ సినిమా నుంచి బయటికి వెళ్లిపోయినట్టు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది .. ఈ సినిమాలో నయనతార హీరో పాత్రకి అక్కగా నటిస్తుందని మరో ప్రచారం ఉంది .. ఆమె పాత్ర కేవలం గెస్ట్ రోలె అని అంతా అనుకున్నారు ..
కానీ ఈ సినిమాలో నయనతార , వివేక్ ఓబెరాయ్‌కి జంటగా నడుస్తుందట .. అలాగే యాశ్, నయనతార , వివేక్ మధ్య ఈ సినిమాలో పలు కీలకమైన సన్నివేశాలు కూడా ఉంటాయని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి .. దీంతో ఈ సినిమాలో క్యారెక్టర్ల విషయంలో కొంత క్లారిటీ అయితే వచ్చింది. అలాగే ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు .. ఇక దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో వేగంగా పూర్తి చేస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ మాత్రం అసలు ఎక్కడా చెప్పటం లేదు .. ప్రతి విషయంలోనూ ఈ సినిమా మేకర్స్ ఎంతో గోప్యత పాటిస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా అనౌన్స్ చేసిన డేట్‌కి రిలీజ్ చేస్తారా ? లేదా ? అన్నది చూడాలి.