
కొన్ని సినిమాలు ఇంతే .. కంటెంట్ బాగున్న అప్పటికీ టైమింగ్స్ సెట్ కాదు .. అందుకే థియేటర్లో ప్లాప్ అవుతూంటాయి .. ఆ తర్వాత ఈ సినిమాలు క్లాసిక్స్ గా మిగిలిపోతాయి .. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటి దే .. ఈ సినిమా పేరు సూర్యవంశం హిందీ లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన సినిమా ల్లో ఇది కూడా ఒకటి .. ఇంకా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు .. సౌందర్య హీరోయిన్గా నటించగా జయసుధా , రచన వంటి వారు కీలక పాత్ర లో కనిపిస్తారు .. ఈ సినిమా థియేటర్ లో ప్లాఫ్ అయ్యింది .. కానీ ఆ తర్వాత కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది .. మరీ ముక్యంగా టీవీ లో ఈ సినిమా కు అంతులేని క్రేజ్ వచ్చింది .
విడుదలై పాతికేళ్లు దాటిన ఇప్పటికీ ఈ సినిమా ను ప్రేక్షకులు చూస్తానే ఉన్నారు .. ఒక టీవీ లోనే కాదు యూట్యూబ్ లో కూడా ఇది పెద్ద హిట్ .. గోల్డ్ మైండ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా ను రేండు యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తే మొత్తంగా 701 మిలియన్ వ్యూస్ ను సాధించింది .. అలాగే తెలుగు లో మాత్రం సూర్యవంశం అన్ని ఫార్మాట్లో కూడా మంచి విజయం సాధించింది .. థియేటర్లో బ్లాక్ బస్టర్ అయన ఈ సినిమా బుల్లి తెరపై కూడా ఇప్పటి కీ రికార్డ్ వ్యూస్ తో అదరగొడుతుంది .. మహేష్ నటించిన అతడు సినిమా కూడా ఈ కావులోకి వస్తుంది .. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ధియేటర్లో ఫ్లాప్ .. స్మాల్ స్క్రీన్ పైన మాత్రం కల్ట్ స్టేటస్ ను తెచ్చుకుంది .. ఇలాంటివే మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి ..