టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు కాగా పూరీ జగన్నాథ్ ప్రస్తుతం బెగ్గర్ అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. టబు, రాధికా ఆప్టే ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
 
టూరిస్ట్ మైండ్ అనే అంశం గురించి తాజాగా పూరీ జగన్నాథ్ మాట్లాడారు. చంద్రమండలం మీద వెయ్యి ఎకరాలు ఉంది? కొనమంటే మీరు కొంటారా? అని పూరీ జగన్నాథ్ ప్రశ్నించారు. అది వేస్ట్ ఇన్వెస్ట్ మెంట్ అని మీకు తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. మిమ్మల్ని మార్స్ పైకి తీసుకెళ్లి లక్ష ఎకరాలు లక్ష రూపాయలు అని చెప్పినా మీరు తీసుకోరని అది మోసమని మీకు తెలుసని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.
 
ఎందుకంటే మీరు ఒక టూరిస్ట్ లా మార్స్ కు వెళ్లారని ఇవాళ ఉంటే రేపు వెళ్లిపోతారని ఇదే మైండ్ సెట్ మీరు ఈ భూమ్మీద కూడా పెట్టి ఆలోచించాలని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. ఇది కూడా వాటిలా ఇంకో ప్లానెట్ అని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. ఇదే శాశ్వతం అనుకుని భూములు, ఆస్తులు కొంటూ ఉంటామని ఆయన తెలిపారు. జీవితాంతం వాటిని కాపలా కాస్తూ బ్రతుకుతామని పూరీ అన్నారు.
 
గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి వెళ్తే ఒక భూమి స్థలం కొనుక్కొని ఇది నాది అనుకొని మురిసిపోతాం అని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. ఒక ఏలియన్ మీకు కనిపించి ఫలనా గ్రహంపై నాకు బోలెడు ఆస్తి ఉందని పేపర్లు చూపిస్తే మీరు ఎలా నవ్వుకుంటారో మనల్ని చూసి ఏలియన్స్ అలాగే నవ్వుకుంటాయని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. పూరీ జగన్నాథ్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెళ్లాల్సిన ప్రదేశానికి నేరుగా వెళ్లకుండా మరో ప్రదేశానికి వెళ్తే అప్పులు కట్టుకుంటూ చస్తావంటూ పూరీ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: