టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ప్రియదర్శి ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ పాత్రల్లో , హీరో పాత్రల్లో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో మాత్రం ప్రియదర్శి వరుస పెట్టి సినిమాల్లో హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. తాజాగా ప్రియదర్శి "సారంగపాణి జాతకం" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా ... వైవా హర్ష , వెన్నెల కిషోర్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కి ప్రస్తుతం మంచి కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 3 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 60 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్లో 75 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.35 కోట్ల షేర్ ... 2.60 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక మూడు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 30 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1.65 కోట్ల షేర్ ... 3.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 4.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 2.85 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అనుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: